గూగుల్ మ్యాప్ ఆధారం డ్రైవింగ్ ..ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు డాక్టర్లు మృతి
- October 02, 2023
తిరువనంతపురం: కేరళలోని కొచ్చిలో గత రాత్రి ఘోరం ప్రమాదం జరిగింది. గూగుల్ మ్యాప్ ఆధారంగా వెళ్తున్న ఓ కారు పెరియార్ నదిలోకి వెళ్లింది. దీంతో కారు నీట మునిగింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు డాక్టర్లు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
మృతులను డాక్టర్ అద్వైత్(29), అజ్మల్(29) గా గుర్తించారు. వీరిద్దరూ ఓ ప్రయివేటు ఆస్పత్రిలో పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురిని స్థానికులు రక్షించినట్లు పేర్కొన్నారు. భారీ వర్షం కారణంగా కారులో ప్రయాణిస్తున్న వారికి రహదారి సరిగా కనిపించకపోవడం, గూగుల్ మ్యాప్ పక్కదోవ పట్టించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. లెఫ్ట్ టర్న్ తీసుకోవాలని గూగుల్ మ్యాప్ సూచించడంతో.. కారు అటుగా వెళ్లడంతో నదిలో మునిగినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కారు నీట మునిగి ప్రమాదానికి గురైందని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







