సుప్రీం కోర్టులో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి

- November 26, 2023 , by Maagulf
సుప్రీం కోర్టులో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి

న్యూ ఢిల్లీ: సుప్రీం కోర్టు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ హాజరయ్యారు. అలాగే భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టులో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము పలు అంశాలపై ప్రసంగించారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము, సీజేఐ చంద్రచూడ్‌ మొక్కలు నాటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com