సెలెక్టెడ్ బీచ్‌లలో బార్బెక్యూలకు అనుమతి
- February 03, 2024
కువైట్: ప్రతి సంవత్సరం నవంబర్ 1 నుండి మార్చి 31 వరకు పబ్లిక్ బీచ్‌లు మరియు వాటర్ఫ్రంట్ల లోపల బార్బెక్యూయింగ్ను అనుమతించాలని కువైట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ సౌద్ అల్-దబ్బౌస్ నిర్ణయం తీసుకున్నారు. టూరిజం ఎంటర్ప్రైజెస్ కంపెనీ (TEC) ద్వారా బీచ్‌లలో బార్బెక్యూ మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు అనుమతించబడుతుంది. సర్వీస్ సెంటర్లోని మేఘనా రెస్టారెంట్ వెనుక, సర్వీస్ సెంటర్లోని బర్గర్ కింగ్ మరియు పిజ్జా హట్ రెస్టారెంట్ల వెనుక , సముద్రపు ఒడ్డున ఉన్న సర్వీస్ సెంటర్లోని విల్లా ఫైరోజ్ రెస్టారెంట్ వెనుక స్థలాలు వీటికి అనువైనవిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఎగైలా (Egaila) బీచ్, అల్-ఖైరాన్ పార్క్ వద్ద బార్బెక్యూయింగ్ నిర్దేశించిన సమయాల్లో మాత్రమే అనుమతించారు. మున్సిపాలిటీకి లోబడి ఉన్న అన్ని కువైట్ దీవులు మరియు బీచ్‌లలో బార్బెక్యూయింగ్ ను నిషేధించారు. నిషేధం ఉన్న వాటిల్లో షువైఖ్ బీచ్, సాల్వా బ్లాక్ 12కి ఎదురుగా అంజాఫా బీచ్ నం. 17, ఎగైలా పార్క్ పక్కన ఫింటాస్ బీచ్ నంబర్ 8, మహ్బౌలా బీచ్ నం. 10, అబు అల్ హసానియా బీచ్ లు ఉన్నాయి. బార్బెక్యూయింగ్ కోసం ఉపయోగించే పదార్థాలు పర్యావరణ అనుకూలమైనవిగా ఉండాలని, బార్బెక్యూయింగ్ నిర్దేశించిన టైల్స్ ఉన్న ప్రదేశాలలో మాత్రమే చేయాలని, ఏదైనా పచ్చని ప్రదేశం మరియు ఇసుకపై చేయకూడదని, స్టవ్ నేల నుండి కనీసం ఒక మీటరు ఎత్తులో ఉండాలని, దానికి సైన్ బోర్డులు ఉండాలి అని కూడా నిబంధనలలో పేర్కొన్నారు. బీచ్‌లలో పరిశుభ్రత స్థాయి మరియు తనిఖీ కోసం మున్సిపాలిటీ, పర్యావరణ పోలీసులచే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేచేయనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ







