బుర్జ్ ఖలీఫా పై 'CCL 2024' ప్రోమో లాంచ్
- February 03, 2024
దుబాయ్: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 10వ సీజన్‌ను ఫిబ్రవరి 2న సాయంత్రం దుబాయ్‌లో ప్రారంభమైంది. ఈ సీజన్ ప్రోమోను అద్భుతమైన బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. కిచ్చా సుదీప్ (కన్నడ), సోహైల్ ఖాన్ (హిందీ), ఆర్య మరియు జీవా (తమిళం), తమన్ మరియు సుధీర్ బాబు (తెలుగు), జిస్సు సేన్‌గుప్తా (బెంగాల్), బన్ను ధిల్లాన్ మరియు సోనూ సూద్ (పంజాబీ), ఇంద్రజిత్ సుకుమారన్ మరియు ఉన్ని ముకుందన్ (మలయాళం) సహా CCLలోని మొత్తం 8 జట్ల నుండి సూపర్ స్టార్లు, కెప్టెన్లు దుబాయ్‌లో ప్రత్యక్షంగా వీక్షించారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అనేది 8 విభిన్న భాషల నుండి 200+ మంది నటులను ఒకచోట చేర్చే ఏకైక స్పోర్ట్స్ లీగ్. లీగ్ ఫిబ్రవరి 23న షార్జాలో ప్రారంభమవుతుంది. టోర్నమెంట్ సోనీ స్పోర్ట్స్ టెన్ 5, జియో సినిమాతో పాటు బహుళ ప్రాంతీయ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. యూఏఈలో జరిగే ఈ టోర్నమెంట్‌ను ట్రక్కర్స్ నిర్వహిస్తుంది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ ఇందూరి మాట్లాడుతూ.. CCL వినోదభరితంగా ఉంటుందన్నారు. CCL 2024 షెడ్యూల్స్ మునుపెన్నడూ లేనంత పెద్దదని తెలిపారు. బుర్జ్ ఖలీఫా ప్రోమో లాంచ్ గురించి సోనూసూద్ స్పందిస్తూ.. 'నేను నా సినిమాల కోసం ఇంతకుముందు బుర్జ్ ఖలీఫాకు వచ్చాను. కానీ క్రికెటర్‌గా బుర్జ్ ఖలీఫాకు రావడం చాలా ప్రత్యేకమైనదని, మరపురానిదని పేర్కొన్నారు. కిచ్చా సుదీప్ మాట్లాడుతూ.. మన గొప్ప దేశంలోని 8 శక్తివంతమైన చలనచిత్ర పరిశ్రమలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సూపర్స్టార్లతో కలిసి ఉండటం, ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఐకానిక్ నిర్మాణం ముందు వారితో కలిసి నిలబడి ఆవిష్కరణను వీక్షించడడం అద్భుతంగా ఉందన్నారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ







