ఇండో-మలేషియా ఫిల్మ్ ఎక్స్ చేంజ్ నిర్వహించిన ఎఫ్.టి.పీ.సి ఇండియా
- February 03, 2024
కౌలాలంపూర్: బాహుబలి, పుష్ప, సలార్ వంటి చిత్రాలతో ఇండియన్ సినిమా ముఖ్యంగా తెలుగు సినిమా అంటే మలేషియన్ వాసులు అమితాసక్తిని కనబరుస్తున్నారని, ముఖ్యంగా మన పాటలు వారు స్పష్టంగా పడుతుండటం చూసి ఎంతో ఆనందం కలిగిందని ఫిలిం అండ్ టెలివిజన్ ప్రొమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్ష, కార్యదర్శులు జంగా చైతన్య, విజయ్ వర్మ పాకలపాటి హర్షం వ్యక్తం చేశారు. సినీ సాంకేతికత, నైపుణ్యం మరియు టూరిజం వంటివి ఇరు దేశాల మధ్య సంబంధాలు పెంపొందించుటయే లక్యంగా ఇప్పటికే నేపాల్, శ్రీలంక దేశాలలో కార్యక్రమాలు నిర్వహించిన ఎఫ్.టి.పి.సి ఈ వారంలో మలేషియా లోని కౌలాలంపూర్ లో ఇండో-మలేషియా ఫిలిం అండ్ టూరిజం ఎక్స్చేంజి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించి ఇండియాలో వున్న సినీ సాంకేతిక నిపుణత మరియు లొకేషన్స్ పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించింది. అలాగే మలేషియాలో వున్న లొకేషన్స్ మరియు సాంకేతిక నిపుణులతో అవగాహన కుదుర్చుకొంది. తద్వారా మన చిత్రాలు సులభంగా అక్కడ షూటింగ్ చేసుకొనే వీలుందని ఎఫ్ టి పీ సి సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.


తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ







