అల్ ఐన్ లో వర్షం బీభత్సం.. దెబ్బతిన్న కార్లు, స్కూల్స్, షాప్స్
- February 13, 2024
యూఏఈ: అల్ ఐన్లో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షంలా కురిసిన వడగళ్ళుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. 'మునుపెన్నడూ చూడని వడగళ్ల వాన’ చూడలేదని గార్డెన్ సిటీలో నివసించే రోజీ తెలిపారు. గత 40 ఏళ్లుగా అల్ ఐన్లో నివసిస్తున్న లిజేష్ ప్రేమ్‌లాల్ అనే భారతీయుడు తీవ్రమైన వడగళ్ల వాన వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. "గత సంవత్సరాలలో నేను చూడని అత్యంత భారీ వడగళ్ల వాన ఇది. నేను నా పాఠశాల విద్యను ఇక్కడే పూర్తి చేశాను. ఇంత పెద్ద తుఫానును ఎప్పుడూ చూడలేదు." అని పేర్కొన్నారు.తన కారు పైకప్పులు మరియు కిటికీలు వడగళ్ళ కారణంగా దెబ్బ తిన్నాయని చెప్పారు. అల్ ఐన్‌లోని ఇండియన్ సోషల్ సెంటర్ మాజీ ప్రెసిడెంట్, ఇప్పుడు ఆటోమొబైల్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న ముబారక్ ముస్తఫా మాట్లాడుతూ.."నా ఇంటి వెనుక ఒక వాడి ప్రవహిస్తోంది. పైన మంచు బంతులు ఉన్నాయి. నేను ఇక్కడ 26 సంవత్సరాల నుంచి ఉంటున్నా ఇలాంటివి ఎప్పుడూ చూడలేదన్నారు. దురదృష్టవశాత్తు తన కారు పజెరో సైడ్ మిర్రర్లు మరియు వెనుక కిటికీలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఒక్క అల్ ఐన్ జాహిలీలో 500-600 కార్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అనేక ప్రాంతాలలో భవనాలు దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా పలు పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయని అల్ ఐన్‌లోని పాఠశాలల యూనియన్ లీడర్ జాహిద్ సరోష్ వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!







