అల్ రియాద్ కనష్ట్రక్షన్ యల్.యల్.సి (కనష్ట్రక్షన్ మేనేజర్)చందక రామదాస్ తో ముఖాముఖి

- June 10, 2016 , by Maagulf
అల్ రియాద్ కనష్ట్రక్షన్ యల్.యల్.సి (కనష్ట్రక్షన్ మేనేజర్)చందక రామదాస్ తో ముఖాముఖి

1)    విదేశాల్లో ఉద్యోగం చేయడమే చాలా కష్టమైన పని. అలాంటిది, మస్కట్‌ దేశంలో కన్‌స్ట్రక్షన్‌ కంపెనీని ఎలా స్థాపించగలిగారు? ఈ క్రమంలో మీకు సన్నిహితులు, కుటుంబ సభ్యుల నుంచి లభించిన సహాయ సహకారాలేంటి? 

A)    నేరుగా ఇంజినీరింగ్ పట్టా చేతపట్టీ 'ముంబై' నగరానికి చేరుకొని 1 సంవత్సరం అనుభవమ సంపాదించి, గల్ఫ్ ప్రయత్నాలు మొదలుపెట్టి నేరుగా గల్ఫ్ (ఒమాన్) లోని అతిపెద్ద సంస్థ అయిన 'గల్ఫార్ గ్రూప్' లో జాయిన్ అయ్యాను. షుమారు 2 సంవత్సరాలు చేసి మరలా వేరే కనష్ట్రక్షన్ కంపెనీ 'TOWELL ZAWRA' గ్రూప్ లో 4 సంవత్సరాలు చేసాను. ఇక్కడ చెప్పాలసిన్దేటంటే, ఇక్కడ కూడా తెలుగు వారు అంతంత మాత్రమే ఉండే రోజులవి (1998 లో). మన భారతీయులైనప్పటికీ 'మళయాళీల' ఆధిపత్యం కాస్తంత ఇబ్బంది పెట్టింది. కాలేజీ చదువుల్లో అగ్రవర్ణ వివక్ష...ఇక్కడ ప్రాంతీయ వివక్ష..ఒక్కోసారి పోరాటమే జీవితం ఏమో అనిపించింది. సరిగ్గా అప్పుడే ఆలోచించి నెమ్మదిగా చిన్న చిన్న పనులు (contracts) మొదలు పెట్టడము జరిగింది. ఎన్ని రోజులని ఒకరి కింద, మనమూ ప్రయత్నిద్దాము అన్న ప్రయత్నమే ఈ కాంట్రాక్టింగ్ (civil construction) ఫీల్డ్.

2)    ఈ సుదీర్ఘ ప్రస్తానంలో మీరెదుర్కొన్న ఇబ్బందులు, సమస్యలు, సవాళ్ళ గురించి వివరించండి? 
A)    ఉత్తరాంధ్ర ప్రాంత వాసిగా కాస్తంత 'వివక్షకు' చదువుకున్న రోజుల్లో గురి అయినమాట వాస్తవము. బి.టెక్ (సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ, విజయవాడ) చదువుకున్నప్పుడు, కాస్త ఉత్తరాంధ్ర వాసిగా మరియు ఒక బలమైన సామాజిక వర్గముతో 'వివక్షకు' గురి అయి నిద్రలేని రోజులు గడిపాను. అప్పుడే నాలో కాస్త మొండితనము, ధైర్యము వచ్చిందని చెప్పాలి. మనకు మనముగా చెప్పాలి అన్న కసి కాస్త చదుకున్న రోజుల్లోనే ప్రారంభమయింది.

3)    తెలుగువారిని ఏకం చేయాలన్న ఆలోచన మీకెలా వచ్చింది? 
A)    అయితే మీకు ఒక్క విషయం నేను చెప్పాలి. కాంట్రాక్టర్ గా కన్నా, సివిల్ ఇంజనీర్ గా కన్నా మస్కట్ ప్రజలకు, ఈ దేశ తెలుగువారికి రామదాసు ఒక మెగాస్టార్ చిరంజీవి గారి వీరాభిమాని గానే సుపరిచితము. మస్కట్ లో మన తెలుగువారికి అంటూ ఒక గుర్తింపు రావాలి  మరియు మనము ఎవరికన్నా తక్కువ కాము అని చెప్పి, మా మిత్రులు 10 మంది కలిసి CMYF (Chiru Mega Youth Force) అని నామకరణం చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు మొదలు పెట్టాము. ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే, ఒకప్పుడు తెలుగు సినిమాలు మస్కట్ లో ప్రదర్శనకు నోచుకునేవి కావు. అలాంటి రోజుల్లో దుబాయ్ వారితో మాట్లాడి మస్కట్ లో కూడా తెలుగు సినిమాలు ప్రదర్శనకు పూనుకొంది. ఇక మా CMYF ముఖ్య ప్రణాళిక ... రక్తదానం. మా అందరి ఆరాధ్య వెండితెర ఇలవేల్పు చిరంజీవి గారి పేరుమీద 2000 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం 3 దఫాలు తూ.చ తప్పకుండా రక్తదాన (మెగా రక్తదానం) శిబిరాలు ఏర్పాటు చేసి గత 11 ఏళ్ళగా MOH (మినిస్ట్రీ ఆఫ్ హెల్త్) తో 'ఉత్తమ రక్తదాతల సంస్థ' గా పేరుపొందింది. తెలుగువారు మరీ ముఖ్యంగా చిరంజీవిగారి అభిమానుల సత్తా చాటి చెప్పాము.

4)    ఓ వైపు సంస్థ పనుల్లో బిజీ, ఇంకోపక్క సేవా కార్యక్రమాలపై ఆసక్తి, రెండిటినీ ఎలా బ్యాలన్స్‌ చేయగలుగుతున్నారు? 
A)    ఇక నా కన్స్ట్రక్షన్ పనులు కాస్త పక్కకు పెట్టి మాట వాస్తవము, మస్కట్ లో నా ఆప్తమిత్రులు షుమారు 10 మంది ఎప్పుడూ చెప్తారు, కానీ వేరే పైన చెప్పిన కార్యక్రమాలలో మునిగి ఉండటము, కాస్త సమయాభావము ఇబ్బంది గానే ఉంది. రానున్న రోజుల్లో దానిని అధిగామిస్తానన్న ధైర్యం అయితే ఉంది.

5)    నేటి యువత కెరీర్‌ని ఎంచుకోవడంలో ఒక్కోసారి అయోమయానిక గురవుతున్నారు. వారికి మీరిచ్చే సలహా? 
A)    ఇప్పుడు యువతకు మేము ఇచ్చే సందేశము, దేనికీ భయపడకుండా, ఉన్నచోటే స్థిరపడదామని ఆలోచించకుండా పెద్ద నగరాలయిన ముంబై, బెంగళూరు, చెన్నై తరలి వెళ్లి, కామ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని ఏ విదేశములో ఉద్యోగ అవకాశాలు వచ్చినా భయపడకుండా వెళ్ళండి. ఎక్కడయినా మన భారతీయులు ఉన్నారు. ఎప్పుడూ తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా శాశ్వత ప్రయోజనాలకై దృష్టి పెట్టే బాధ్యత ప్రతీ యువత పై ఉంది.


6)    మస్కట్‌ మిమ్మల్ని ఎంతో ఆదరించింది. ఇక్కడి పరిస్థితుల గురించి, ఇక్కడి సన్నిహితుల సహాయ సహకారాల గురించి చెప్తారా? 
A)    మస్కట్ మమ్ములను మరీ ముఖ్యంగా భారతీయులందరినీ ఆదరించింది. ఈ దేశ రాజుగారుకు మనము సర్వదా ఋణపడి ఉన్నాము (శ్రీ సుల్తాన్ బిన్ కాబుస్ బిన్ సయ్యద్) బహుశ ఏ మధ్యప్రాచ్చదేశంలో (మిడిల్ ఈస్ట్ (గల్ఫ్)) లేనంత ఒసులుబాటు ఈ దేశంలో మన భారతీయులకు ఉంది. పేరుకు ముస్లిం దేశమయినా, గుడులు, గోపురాలు, పూజలు, పురస్కారాలకు మస్కట్ పెట్టింది పేరు.


7)    చేపడుతున్న ప్రాజెక్టులు, కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టుల వివరాలు తెలియజేయండి?
A)    ఇలాపోతూ మా CMYF ఆధ్యాత్మికంగా ఒకడుగు ముందుకు వేసి శ్రీ సీతారాముల కల్యాణము, బతుకమ్మ పండుగ, మహా లింగార్చన (కార్తీక వనభోజనాలు) కార్యక్రమాలు చేస్తూ తెలుగువారందరినీ ఒక గొడుగుకిందకు తెచ్చే ప్రయత్నములో సఫలీక్రుతులం అయ్యాము.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com