తెలుగు ఆడియన్స్‌కి ఎస్. జె సూర్య విలనిజం.!
- July 10, 2024
రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన ఎస్.జె.సూర్యకు తెలుగులోనూ వీరాభిమానులున్నారు. ఆయన తెరకెక్కించిన ‘ఖుషి’ మూవీ ఎవర్ గ్రీన్ సినిమా తెలుగులో. అలాగే ఆయన పోషించిన పలు పాత్రలు కూడా తెలుగులో పాపులరే.
ఇక, ఇప్పుడు ఆయన తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కానున్నారు. ప్రస్తుతం ‘ఇండియన్ 2’ చిత్రంలో నటించారాయన. ఈ నెలలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు.
విలక్షణ నటుడైన ఎస్.జె.సూర్య నటన, రామ్ చరణ్‌కి పోటీగా ఈ సినిమాలో ఏ రేంజ్లో వుండబోతోందో ఊహించడానికే కష్టం అనేలా వుండబోతోందట. శంకర్ దర్శకత్వంలో రూపొందిన పాత్ర కదా. అది వేరే లెవలే వుంటుంది.
ఇక, నాని నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమాలోనూ ఎస్.జె.సూర్య ఓ డిఫరెంట్ విలనిజం చూపించబోతున్నారట. ఆల్రెడీ మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ సినిమాలో ఆయన కరడు కట్టిన విలనిజం ప్రదర్శించి మెస్మరైజ్ చేశారు.
ఇక, ఇప్పుడు రాబోయే తెలుగు సినిమాల్లో ఆయన విలనిజానికి స్పెషల్‌గా మరింత స్పెషల్‌గా ఫ్యాన్ బేస్ క్రియేట్ కావడం పక్కా అన్నమాటే.!
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







