సౌదీ ఎయిర్‌లైన్స్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
- July 12, 2024
సౌదీ ఎయిర్‌లైన్స్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రియాద్ నుంచి బయలుదేరిన విమానం పెషావర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతున్న సమయంలో ఎడమ గేర్ నుంచి దట్టమైన పొగలతోపాటు మంటలు రావడాన్ని విమానాశ్రయం ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులు గుర్తించారు.ఈ విషయాన్ని విమాన పైలెట్‌తోపాటు సహాయక బృందాలకు సమాచారం అందించారు.దీంతో విమానాన్ని వెంటనే విమానాశ్రయంలో నిలిపివేశారు.
అనంతరం విమానం నుంచి ప్రయాణికులతోపాటు సిబ్బందిని దింపివేశారు.మరోవైపు విమానం గేర్ వద్ద ఎగసిపడుతున్న మంటలను ఆర్పివేశారు.ఈ ఘటనకు గల కారణాలను సాంకేతిక బృంద నిపుణులు అన్వేషిస్తున్నారు.ఈ రోజు ఉదయం 276 మంది ప్రయాణికులు, 21 విమాన సిబ్బందితో రియాద్ నుంచి సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం ఎస్వీ 792 పాకిస్థాన్‌లోని పెషావర్‌కు బయలుదేరింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని సౌదీ ఎయిర్ లైన్స్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







