ప్రియదర్శి హీరోగా నేనూ ఓ సినిమా చేస్తా.!
- July 16, 2024
కమెడియన్‌గా తనకంటూ ఓ స్పెషల్ స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు ప్రియదర్శి. ఇప్పుడు హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ‘మల్లేశం’ సినిమాతో హీరోగా అవతారమెత్తిన ప్రియదర్శి ఇప్పుడు కమర్షియల్ సినిమాలతోనూ రాణిస్తున్నాడు.
తాజాగా ప్రియదర్శి హీరోగా నటించిన చిత్రం ‘డార్లింగ్’. ఈ నెల 19న ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నేచురల్ స్టార్ నాని గెస్ట్‌గా విచ్చేశాడు.
సినిమా చాలా బాగుందని చెప్పాడు. అందరికీ నచ్చుతుందనీ, ప్రియదర్శిని చాలా ఎంకరేజ్ చేశాడు. అలాగే, మాటల్లో మాటగా తన నిర్మాణంలో తానూ ఓ సినిమా చేస్తానని కూడా చెప్పేశాడు నాని.
నాని నిర్మాణంలో ప్రియదర్శి హీరోగా ఓ మాంచి కమర్షియల్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. డైరెక్టర్ ఇతర వివరాలు తెలీయవు కానీ, ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అయితే త్వరలో వుంటుందని చెప్పాడు.
నాని హీరోగా నటించిన పలు చిత్రాల్లో ప్రియదర్శి కూడా హీరోకి ఫ్రెండ్ రోల్స్‌లో నటించి మంచి కాంబినేషన్ ఇచ్చాడు. అంతేకాదు, పాత రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి ఎలా ఇన్సిప్రేషనో, ఇప్పటి జనరేషన్‌కి నాని కూడా అంతే ఇన్సిప్రేషన్.. కొత్తగా సినిమాల్లోకి రావాలనుకునేవాళ్లకి. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో నాని అని ప్రియదర్శి ఈ సందర్భంగా చెప్పాడు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







