పల్లీలతో వెన్ను నొప్పి దూరం చేసుకోవడమెలా.?
- July 16, 2024
కొన్ని రకాల నొప్పులకు వైద్య చికిత్సతో పాటూ కొన్ని రకాల ఇంటి చిట్కాలు కూడా అవసరమవుతాయ్. అందులో ఒకటి పల్లీలు. పల్లీలతో పాటూ, నువ్వులు, బెల్లం కలిపి తీసుకునే ఆహారం వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ప్రొటీన్లతో పాటూ, మోనో పాలీ అన్ శాచురేటెట్ ఫ్యాట్స్ వుంటాయ్. ఇవి ఎముకల్ని ధృఢంగా మార్చేందుకు సహకరిస్తాయ్. అలాగే విటమిన్ ఇ, బి1, బి3, మెగ్నీషియం, పాస్ఫరస్ వంటి మూలకాలూ కూడా పుష్కలంగా వుంటాయ్.
ఇవి కీళ్ల నొప్పితో పాటూ, దీర్ఘకాలిక వెన్ను నొప్పిని సైతం తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే నువ్వుల్లో ఎన్నో రకాల పోషకాలున్నాయ్.
ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, మెగ్నీషియం, పాస్ఫరస్, ఐరన్, విటమిన్ ఇ, బి పుష్కలంగా వుంటాయ్. ఇవన్నీ ఎముకల ఆరోగ్యానికి చాలా మంచివి. కాల్షియం, జింక్ కూడా పుష్కలంగా లభించే నువ్వులు తినడం వల్ల రుమాటిజం వంటి సమస్యలు కూడా దూరమవుతాయ్.
అలాగే బెల్లంలో ఐరన్ పుష్కలంగా వుంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ కూడా ఎక్కువే. ఇవి సీజనల్‌గా వచ్చే ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో తోడ్పడతాయ్.
ఈ మూడు రకాలు కలిపి చేసిన వంటకాలను డైలీ మన డైట్లో చేర్చుకోవడం వల్ల ఎముకలు గట్టిపడి ఏ రకమైన నొప్పులైనా దూరమవుతాయని తాజా సర్వేలో తేలింది.
అలాగే దీర్ఘకాలంగా వెన్ను నొప్పితో బాధపడే వారు ఖచ్చితంగా ఈ మూడు పదార్ధాలను కలిపి రోజూ తగిన మోతాదులో తీసుకోవడం మంచి ఫలితం వుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్







