ఒమన్‌లో కాల్పులు..నలుగురు మృతి
- July 16, 2024
మస్కట్: ఒమన్‌లోని వాడి అల్ కబీర్‌లోని మసీదు సమీపంలో మంగళవారం జరిగిన కాల్పుల ఘటనలో కనీసం నలుగురు మరణించగా పలువురు గాయపడ్డారు. అధికారులు విడుదల చేసిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. తూర్పు మస్కట్‌లోని మసీదు పరిసరాల్లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. "వాడీ అల్ కబీర్ ప్రాంతంలోని మసీదు పరిసరాల్లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. అనేకమంది గాయపడ్డారు." అని ఓమానీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. కాల్పుల ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని, గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని పోలీసులు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







