విజయ్ దేవరకొండ న్యూ లుక్ చూశారా.?

- July 25, 2024 , by Maagulf
విజయ్ దేవరకొండ న్యూ లుక్ చూశారా.?

రౌడీ స్టార్ కాస్తా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో ఇమేజ్ మార్చుకున్నాడు. కానీ, వర్కవుట్ కాలేదనుకోండి. ‘ప్యామిలీ స్టార్’ సినిమాని సో సోగానే తీసుకున్నారు ఆడియన్స్.

ఎప్పుడయితే ‘లైగర్’ ఫెయిల్యూర్ అయ్యిందో.. ఆ తర్వాత ఎంతగా ప్రయత్నించినా తన మునుపటి వైభవం తెచ్చుకోలేకపోతున్నాడు విజయ్ దేవరకొండ.

‘ఖుషి’, ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలు చేసినప్పటికీ ఆయన ఇమేజ్‌కి పడిన డ్యామేజ్ కంట్రోల్ కాలేదు. ఇక, ఇప్పుడు వరుసగా మూడు ప్రాజెక్టులు లైన్‌లో పెట్టి వుంచాడు.
అందులో ఒకటి ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి‌తో సినిమా. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. లేటెస్ట్‌గా ఈ సినిమా నుంచి కొన్ని లీకేజ్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్.

ఈ ఫోటోస్‌లో విజయ్ దేవరకొండ చాలా డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు.

దాంతో, హెయిర్ స్టైల్ నుండీ బాడీ లాంగ్వేజ్ వరకూ అంతా డిఫరెంట్ మేకోవర్‌లో కనిపిస్తున్నాడు. షూటింగ్ స్పాట్ నుంచి లీకైన ఈ ఫోటోలు చూసి గుర్తు పట్టేకుండా మారిపోయాడు విజయ్ దేవరకొండ అంటున్నారు.

ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తుండగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com