తెల్ల రక్త కణాలు తగ్గుతున్నాయా.? డైట్లో ఇవి వున్నాయో లేవో చెక్ చేసుకోండి.!
- July 25, 2024
శరీరం ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా ఎప్పుడూ యాక్టివ్గా వుండాలంటే తెల్ల రక్తకణాల సంఖ్య తగిన మోతాదులో వుండాలి.
తెల్ల రక్త కణాలు సక్రమ సంఖ్యలో వున్నప్పుడే రోగ నిరోధక శక్తి బాగుంటుంది. శరీరంలో ఏ చిన్న అనారోగ్యం వచ్చినా వాటితో పోరాడి మనల్ని ఆరోగ్యంగా వుంచే, తెల్ల రక్త కణాల సంఖ్యను జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఏం చేయాలి.?
మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం అంటే.. కొన్ని రకాల ఫుడ్స్ తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడంలో కీలకంగా దోహదం చేస్తాయ్.
అందులో ముఖ్యమైనవి వెల్లుల్లి. వెల్లుల్లిని ప్రతీరోజూ తినడం వల్ల రోగ నిరోధక శక్తి లభిస్తుంది. అంటే తెల్ల రక్త కణాల సంఖ్య సక్రమంగా వుంటుందని అర్ధం.
అలాగే, సిట్రస్ ఎక్కువగా వుండే పండ్లను అధికంగా తీసుకోవాలి. అంటే నిమ్మ, నారింజ, ద్రాక్ష జాతి పండ్లను అధికంగా తీసుకోవాలి. పైనాపిల్లోనూ సిట్రస్ అధికంగా లభిస్తుంది.
బాదం ప్రతీరోజూ డైట్లో చేర్చుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుంటాయ్. అలాగే విటమిన్ ఇ కూడా అధికంగా వుంటుంది. ఇది తెల్ల రక్త కణాల సంఖ్యను రెట్టింపు చేసి రోగ నిరోధక శక్తిని అందిస్తుంది.
పొద్దుతిరుగుడు పువ్వు గింజల్లోని సెలీనియం తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది. అందుకే వీటిని కూరల్లో గ్రేవీ కోసం యూజ్ చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







