ముంబైలో మరో అద్భుతం..సుదీర్ఘ భూగర్భ మెట్రోరైల్ ప్రారంభం
- July 25, 2024
ముంబై: ముంబైలో తొలిభూగర్భ మెట్రో రైలు పరుగులు తీసింది. ముంబై వాసులు ఏళ్ల నిరీక్షణకు బుధవారంతో తెరపడింది. తొలి సర్వీసు పరుగులు తీసింది. దీనికి ఆక్వా లైన్ అని పేరుపెట్టారు. మొదటి దశలో ఇది శాంటాక్రూజ్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్ పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ (సీపడ్) నుంచి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) వరకు నడుస్తుంది. 39.5కి.మీ. పొడవైన ఈ మార్గాన్ని కొలాబా-బాంద్రా-ఎస్ఐపిజడ్ లైన్ అని కూడా పిలుస్తారు. మెట్రోరైళ్లు గరిష్టంగా గంటకు 90 కి. మీ. వేగంతో దూసుకెళ్తాయని, 35 కిలోమీటర్ల ప్రయాణం 50 నిముషాల్లోనే పూర్తవుతుందని అధికారులు తెలిపారు. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే దాదాపు రెండు గంటలు పడుతుంది. తొలి అండర్ గ్రౌండ్ మెట్రో రైల్ సేవలతో ముంబై వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరడంతోపాటు, విలువైన సమయం కూడా ఆదా కానుంది. ఈ మార్గం నిర్మాణ పనులు 2017లో ప్రారంభమయ్యాయి. ఆరే కాలనీ నుంచి పరేడ్ వరకు ఈ మార్గంలో ముంబై మెట్రో 27 స్టేషన్లను కవర్ చేస్తుంది. కఫ్ పరేడ్, విధాన్ భవన్, చర్చ్ గేట్, మహాత్మా చౌక్, సీఎస్టీ మెట్రో, కల్బాదేవి, గిర్గావ్, గ్రాంట్ రోడ్, ముంబై సెంట్రల్ మెట్రో, మహాలక్ష్మి, సైన్స్ మ్యూజియం, డొమెస్టిక్ ఎయిర్ పోర్టు తదితర స్టేషన్ ల మీదుగా పరుగులు తీస్తుంది. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రైలు సేవలు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ
- డ్రైవర్లకు ఎలక్ట్రిక్ బస్సుల బంపర్ అవకాశం..
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!







