కాల్పులు జరిపిన ప్రదేశం నుండే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా: డొనాల్డ్ ట్రంప్
- July 27, 2024
న్యూయార్క్: పెన్సిల్వేనియాలో తనపై కాల్పులు జరిపిన ప్రదేశం నుంచే మరోసారి ర్యాలీ నిర్వహిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సోషల్ మీడియాలో మా ప్రియమైన ఫైర్‌ఫైటర్ కోరే గౌరవార్థం ఆయనను స్మరించుకుంటూ నాపై కాల్పులు జరిగిన జరిగిన ప్రదేశం నుంచే ర్యాలీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ర్యాలీ కోసం పెన్సిల్వేనియాలోని బట్లర్‌కు తిరిగి వెళ్తున్నాం.. ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయాలను తొందరలోనే తెలియజేస్తాను అని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
ఇక, అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం సంచలనం రేపుతుంది. ఈ కాల్పుల్లో మాజీ అగ్నిమాపక సిబ్బంది కోరీ కంపెరాటోర్ ప్రాణాలు వీడిచారు. తన కుటుంబాన్ని కాపాడుకొనే క్రమంలో దుండగుడి తూటాకు అతడు బలైపోయాడు. తాజాగా, జరిగిన బహిరంగ సభలో డొనాల్డ్ ట్రంప్ అతడిని గుర్తు చేసుకుంటూ ప్రత్యేకంగా నివాళులు ఆర్పించారు. కాగా మళ్లీ ఫైర్‌ఫైటర్ కోరీ గౌరవార్థం సభను నిర్వహించబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







