సిరిసిల్లా కార్మికుడు సురక్షితం..త్వరలో ఇండియాకు..!

- July 30, 2024 , by Maagulf
సిరిసిల్లా కార్మికుడు సురక్షితం..త్వరలో ఇండియాకు..!

యూఏఈ: పొట్టకూటికోసం షార్జా వచ్చి పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి అండగా నిలిచారు ఇండియన్ అసోసియేషన్ సభ్యులు. వివరాల్లోకి వెళితే సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఆకెన రవి(36) పొట్ట కూటి కోసం దుబాయ్ వచ్చి తప్పిపోయారు.బాధిత కుటుంబ సభ్యులు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. స్పందించిన తెలంగాణ ప్రభుత్వం దుబాయ్ ఎంబిసి అధికారులకు లేఖ రాసింది. దుబాయిలోని సామాజిక సేవా కార్యకర్త గుండెల్లి నర్సింహులు చొరవ తీసుకొని ఎంబసీ అధికారుల సమన్వయంతో..రవి షార్జా పోలీసుల అదుపులో ఉన్నాడని తెలుసుకున్నారు. అనంతరం లీగల్ గా పోరాడి రవిని విడుదల చేయించారు.ఇండియన్ అసోసియేషన్ సభ్యుల సహాకారంతో రవిని గుండెల్లి నర్సింహులు చేరదీశారు.త్వరలోనే ఇండియా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.సకాలంలో స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, గుండెల్లి నర్సింహులు లకు రవి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com