నకిలీ పాస్‌పోర్ట్.. 75 ఏళ్ల యూరోపియన్ వ్యక్తికి 3 ఏళ్ల జైలుశిక్ష
- July 31, 2024
మనామా: నకిలీ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి బహ్రెయిన్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినందుకు 75 ఏళ్ల యూరోపియన్ వ్యక్తికి హై క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన మార్చి 22న బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది.
మొదట ఆరోపణలను తిరస్కరించిన నిందితుడు.. సమగ్ర విచారణ తర్వాత దోషిగా తేలాడు. దేశంలోకి ప్రవేశించే ప్రయత్నంలో నకిలీ ఎలక్ట్రానిక్ పత్రాన్ని, ప్రత్యేకంగా పాస్‌పోర్ట్‌ను ఉపయోగించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ అతనిపై అభియోగాలు మోపింది. విచారణలో తప్పుడు డేటాను ప్రవేశానికి ఉపయోగించినట్టు, నకిలీ పాస్‌పోర్ట్‌ను పాస్‌పోర్ట్ ను ఉపయోగించినట్టు అంగీకరించాడు. తదుపరి విచారణలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ నుండి వచ్చిన నివేదిక, అలాగే యూరోపియన్ ఎంబసీ నుండి వెరిఫికేషన్ ద్వారా పాస్‌పోర్ట్ ఫోర్జరీని నిర్ధారించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి