అమరావతిలో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కీలక భేటీ
- July 31, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అమరావతిలో సమావేశమయ్యారు. నామినేటెడ్ పదవులతో పాటు ఇతర కీలక అంశాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. నామినేటెడ్ పోస్టుల కేటాయింపు పై ఈ భేటీలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
కష్టపడిన వారందరినీ గుర్తించి సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు ఇప్పటికే పలు సందర్భాల్లో తెలిపారు. టీడీపీ విషయానికి వస్తే తమ పార్టీలో కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి ఇప్పటికే టీడీపీ కసరత్తులు పూర్తి చేసింది.
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైసీపీ నుంచి వచ్చిన ఒత్తిళ్లను తట్టుకుని ఎవరు పనిచేశారన్న వివరాలపై ఆరా తీసింది. అలాగే, దాడులకు గురైన వారి వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఏయే శాఖల్లో ఏయే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయన్న వివరాలను తీసుకుంది.
నామినేటెడ్ పదవుల భర్తీపై టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య అవగాహన కుదిరింది. కూటమి అధికారంలోకి వచ్చి 45 రోజులు గడిచినా నామినేటెడ్ పోస్టులపై తుది నిర్ణయం తీసుకోలేదు. మూడు పార్టీల మధ్య పదవుల పంపకంపైన ఫార్ములా తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి