భారత రాష్ట్రపతికి సంతాపం తెలిపిన సుల్తాన్

- August 01, 2024 , by Maagulf
భారత రాష్ట్రపతికి సంతాపం తెలిపిన సుల్తాన్

మస్కట్: దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో వరదలు మరియు కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో వందలాది మంది మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో ఒమాన్ రాజు సుల్తాన్ హైతం బిన్ తారిక్ భారత రిపబ్లిక్ ప్రెసిడెంట్‌కు సంతాపాన్ని తెలియజేసారు. “ప్రళయాలు మరియు కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సంతాప సందేశం పంపించారు. " అని సుల్తాన్ కార్యాలయం వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com