వయనాడ్‌లో 256 పెరిగిన మృతుల సంఖ్య

- August 01, 2024 , by Maagulf
వయనాడ్‌లో 256 పెరిగిన మృతుల సంఖ్య

వయనాడ్: ప్రకృతి ప్రకోపానికి గురైన కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలోని అనేక గ్రామాలు శవాల దిబ్బగా మారిపోయాయి. కొండ చరియలు విరిగిపడటం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 256కు చేరింది. మరో 220 మంది ఆచూకీ తెలియడం లేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో భాగంగా, సైనికులు ఇప్పటివరకు వెయ్యి మందిని రక్షించారు.

ముఖ్యంగా, భారీ వర్షాల కారణంగా ముండక్కై, చూరమల, అత్తమల, నూల్‌పుళ గ్రామాల్లో మంగళవారం మూడుసార్లు కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ మూడు గ్రామాలు శవాల దిబ్బలుగా మారిపోయాయి. కుటుంబాలకు కుటుంబాలే తుడిచిపెట్టుకునిపోయాయి. ఎటు చూసినా శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. దాదాపు 1500 మంది ఆర్మీ సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాలుపుంచుకుంటున్నారు. ఫోరెన్సిక్ సర్జన్లను కూడా మొహరించినట్టు కేరళ ఆరోగ్య శాఖ వీణాజార్జ్ తెలిపారు.

బాధితులను రక్షించేందుకు చూరమలలో ఆర్మీ ఇంజనీర్ టాస్క్‌ఫోర్స్ బృందం తాత్కాలిక వంతెన నిర్మించింది. సహాయ కార్యక్రమాల్లో డాగ్ స్క్వాడ్‌లు కూడా పాలు పంచుకుంటున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేడు వయనాడ్‌ సందర్శిస్తారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో మరోమారు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హెచ్చరించింది. వయనాడ్‌తో పాటు ఇతర జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు, వయనాడ్ విలయంపై అమెరికా, రష్యా, చైనా, ఇరాన్ తదితర దేశాలు స్పందించాయి. మృతులపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com