బాలింతలు తప్పకుండా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి అని అవగాహనా ర్యాలీ

- August 02, 2024 , by Maagulf
బాలింతలు తప్పకుండా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి అని అవగాహనా ర్యాలీ

హైదరాబాద్: తల్లిపాలు అమృతం లాంటివి. నవజాతి శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు తల్లిపాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రకృతి సిద్ధంగా లభించే పాలు బిడ్డకు ఎంతో మేలు చేస్తాయి.  తల్లి పాలల్లో వివిధ రకాల పోషకాలుంటాయి. తల్లిపాలు బిడ్డకి ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా తల్లీ బిడ్డకి మధ్య చక్కని ప్రేమ బంధాన్ని పెంపొందిస్తుంది. బిడ్డ మానసిక ఆరోగ్యం చక్కగా వృద్ధి చెందుతుందని అంటున్నారు మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు. శిశువులకు తల్లిపాలు అనువైన ఆహారం. ఇది సురక్షితమైనది, శుభ్రమైనది మరియు అనేక సాధారణ బాల్య వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడే ప్రతిరోధకాలను కలిగి ఉంటుంది. శిశువు జీవితంలోని మొదటి నెలలకు అవసరమైన శక్తిని మరియు పోషకాలను తల్లిపాలు అందిస్తుంది. తల్లిపాలు తాగే పిల్లలు  అధిక బరువు లేదా ఊబకాయం మరియు తరువాత జీవితంలో మధుమేహం వచ్చే అవకాశం తక్కువ. తల్లిపాలు తాగే స్త్రీలకు రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. 

అనంతరం డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగే-HOD నియోనాటాలజీ మరియు పీడియాట్రిక్స్ గారు మాట్లాడుతూ తల్లిపాలు నుంచి పిల్లలకు పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు శిశువుకు సులభంగా జీర్ణమవుతుంది కూడా కానీ మనదేశంలో  బ్రెస్ట్ ఫీడింగ్ రేట్ తక్కువగా ఉందన్నది మాత్రం వాస్తవం. కొంతమంది ఆరోగ్య సమస్యల వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ చేయలేకపోతున్నారు. మరికొంతమంది, బ్రెస్ట్ ఫీడింగ్ పట్ల ఇంట్రెస్ట్ చూపించట్లేదు. స్టడీస్ ప్రకారం బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల తల్లీ బిడ్డలు హెల్తీగా ఉంటారు. 

బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల తల్లీబిడ్డలకు కలిగే లాభాలు 
1.శిశువుకు తగినంత న్యూట్రిషన్ అందుతుంది 
2. బ్రెస్ట్ మిల్క్ లో యాంటీ బాడీస్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి వైరస్ పై అలాగే బాక్టీరియాపై పోరాటం చేయగలుగుతాయి.
3. వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది.
4. హెల్తీ వెయిట్ పిల్లల్లో ఊబకాయం రిస్క్ తగ్గుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ అందిన బేబీస్ లో ఫార్ములా మిల్క్ తాగిన బేబీస్ తో పోల్చితే ఒబెసిటీ రిస్క్ 15 నుంచి 30 శాతం తక్కువ
5. డిప్రెషన్ & డిసీజ్ రిస్క్: ప్రసవం తరువాత తల్లుల్లో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ మరియు  క్యాన్సర్ రిస్క్ తో పాటు ఇతర వ్యాధుల బారిన పడే రిస్క్ తగ్గుతుంది.
6.బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల  సమయాన్ని అలాగే డబ్బును ఆదా చేయవచ్చు.  

ఈ కార్యక్రమంలో మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ జనార్దన్ రెడ్డి - కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ & ఇంటెన్సివిస్ట్, డాక్టర్ బి.రాధిక - సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాపరోస్కోపిక్ సర్జన్ & ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ , డాక్టర్ మధుమోహన్ రెడ్డి -సీనియర్ పిడియాట్రిక్ సర్జన్,డాక్టర్ ఆశిష్ సప్రె - పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్, డాక్టర్ M నవిత కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్ & పీడియాట్రిషియన్ మరియు సెంటర్ హెడ్ కృష్ణ ప్రసాద్ గారు మరియు 100 మందికి పైగా ఇతర సిబ్బంది పాల్గొని మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ నుండి సైబర్ గేట్ వరకు  ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com