ఏపీలో అక్టోబర్ నుంచి కొత్త లిక్కర్ పాలసీ..!
- August 02, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ నుంచి కొత్త లిక్కర్ పాలసీ అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. నూతన మద్యం విధానం రూపకల్పనపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త విధానం రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. 6 రాష్ట్రాల్లో అధ్యయనం కోసం అధికారులతో కూడిన 4 బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులు ఉండనున్నారు.
రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు 4 బృందాలు వెళ్లనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఎక్సైజ్ పాలసీ, మద్యం షాపులు, బార్ లు, ధరలు, మద్యం కొనుగోళ్లతో పాటు నాణ్యం, చెల్లింపుల విధానం, డిజిటల్ పేమెంట్ అంశాలపై ఈ బృందాలు అధ్యయనం చేయనున్నాయి. ట్రాక్ అండ్ ట్రేస్, డీ అడిక్షన్ సెంటర్ల నిర్వహణ వంటి అంశాలపైన దృష్టి పెట్టనున్నారు. అత్యుత్తమ విధానాలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ నెల 12లోగా నివేదికలు సమర్పించాలని 4 అధ్యయన బృందాలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అక్టోబర్ 1 నుంచి నూతన ఎక్సైజ్ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి