బిగ్‌బాస్‌ తెలుగు 8వ సీజన్‌లోనూ హోస్ట్‌గా హీరో నాగార్జున..

- August 02, 2024 , by Maagulf
బిగ్‌బాస్‌ తెలుగు 8వ సీజన్‌లోనూ హోస్ట్‌గా హీరో నాగార్జున..

హైదరాబాద్: ఇందులో దొంగగా దర్శనమిచ్చిన సత్య తన భార్యతో ఫోనులో మాట్లాడతాడు. పురాతన వస్తువులు ఉన్న షాపులో వాటిని చోరీ చేస్తున్నానని చెబుతాడు. టిప్పు సుల్తాన్ కత్తి, మోనాలిసా అద్దంతో పాటు అనేక ఆకర్షణీయమైన వస్తువుల గురించి ఫన్నీగా వివరిస్తాడు. ఆ సమయంలో ఒక్కసారిగా అక్కడి మాయా దీపం కదులుతుంది.

దానిని సత్య తాకినప్పుడు పొగ వస్తుంది. నాగార్జున వరాలు ఇచ్చే జీనీలా కనపడ్డారు. వరాలు ఇచ్చే కింగ్‌… ఒక్కసారి కమిటైతే లిమిటే లేదు అని నాగార్జున అన్నారు. బిగ్‌బాస్-8 ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో ఇందులో చెప్పలేదు. కంటెస్టెంట్‌లుగా ఎవరెవరు కనపడతారన్న ఆసక్తి నెలకొంది. ఇందులో పాల్గొంటున్నారంటూ ఇప్పటికే కొందరి పేర్లు ప్రచారమవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com