సప్తముఖ మహాశక్తిగా ఖైరతాబాద్ గణపతి

- August 03, 2024 , by Maagulf
సప్తముఖ మహాశక్తిగా ఖైరతాబాద్ గణపతి

హైదరాబాద్: ఖైరతాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి విగ్రహ నమూనా విడుదలైంది.ఈసారి ఖైరతాబాద్ గణేశుడు ‘సప్తముఖ మహాశక్తి గణపతి’గా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ మేరకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ శుక్రవారం సాయంత్రం ఆది దేవుడి చిత్రపట నమూనాను విడుదల చేసింది.

ఇక‌ ఈ ఏడాది 70 అడుగుల విగ్రహాన్ని సిద్ధం చేస్తున్న‌ట్టు తెలిపింది.ఖైరతాబాద్ గణనాథుడికి కుడివైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమ వైపున శివపార్వతుల కళ్యాణం ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com