పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రాకు రజతం..
- August 09, 2024
పారిస్: ఎన్నో అంచనాలతో పారిస్ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టుకున్నాడు. వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటుతో నిరాశలో మునిగిపోయిన భారత అభిమానులకు కాస్త ఊరట నిచ్చాడు. వాస్తవానికి అతడు స్వర్ణం పతకం గెలుస్తాడని భావించినప్పటికి అలా జరగలేదు. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ స్వర్ణం స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. కాగా.. పారిస్ ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య ఐదుకు చేరింది.
నాలుగేళ్ల క్రితం ఏ మాత్రం అంచనాలు లేని సమయంలో ఏదో ఒక పతకం రావడమే గొప్ప అనుకున్న స్థితిలో ఏకంగా స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు నీరజ్ చోప్రా. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్ భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఈ బల్లెం వీరుడు క్వాలిఫికేషన్‌లో 89.34 మీటర్ల దూరం విసిరి అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకున్నాడు.
ఫైనల్‌లోనూ అంతకంటే కాస్త మెరుగైన ప్రదర్శనే చేశాడు. 89.45 మీటర్ల దూరం విసిరాడు. అయినప్పటికి ఈ దూరం స్వర్ణ పతకం గెలుచుకునేందుకు సరిపోలేదు. నీరజ్ కెరీర్‌లోనే ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం.
పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ ఒలింపిక్స్ రికార్డు బద్దలు కొట్టాడు. 92.97మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని ఎగురవేసుకుని పోయాడు. ఇక వీరిద్దరు కూడా తొలి ప్రయత్నంలో పౌల్ చేయగా రెండో ప్రయత్నంలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన చేయడం గమనార్హం. మైదానం బయట వీరిద్దరు మంచి మిత్రులు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









