భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయం: ప్రధాని మోడీ
- August 15, 2024
న్యూ ఢిల్లీ: 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట పై ప్రధాని మోడీ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆ సమయంలో భారత ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురిపించింది.రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ దనఖడ్, కేంద్రమంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2047 వికసిత్ భారత్ థీమ్‌తో ఈసారి పంద్రాగస్టు వేడుకలు జరుగుతున్నాయి.
ఇక ఎర్రకోట పై జాతీయజెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదే జాతినుద్దేశించి ప్రసంగించారు. ముందుగా దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్స శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయం అని అన్నారు. హర్‌ఘర్ తిరంగా పేరుతో దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయన్నారు. దేశం కోసం తమ జీవితాలనే పణంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని, ఈ సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుందామని ప్రధాని పిలుపునిచ్చారు. మహనీయుల త్యాగాలకు ఈ దేశం రుణపడి ఉందని పేర్కొన్నారు.
శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందని, స్వాతంత్ర్యం కోసం ఆ నాడు 40 కోట్ల మంది పోరాడారని గుర్తు చేశారు. ఇవాళ దేశ జనాభా 140 కోట్లకు చేరుకుందని, మనమంతా వారి కలలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..