స్వాతంత్ర దినోత్సవం

- August 15, 2024 , by Maagulf
స్వాతంత్ర దినోత్సవం

ఈ ఏడాది ఆగస్టు 15, 2024న భారతదేశం తన 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. బ్రిటీష్ వలసపాలన బారి నుంచి మనల్ని మనం విడిపించుకుని కొత్త ఆరంభాన్ని సృష్టించుకున్నామని ఈరోజు మన భారతీయులందరికీ గుర్తుచేస్తుంది. ఈరోజున పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు సహా అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ పండుగను కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు. ఆ క్రమంలో కొంతమంది త్రివర్ణ రంగుల దుస్తులు ధరిస్తారు. మరికొంత మంది నృత్యాలు చేయగా, ఇంకొంతమంది ప్రసంగాలు చేస్తుంటారు. జెండాలు ఎగురవేసిన తర్వాత ఆయా ప్రాంతాల్లో మిఠాయిలు పంచుకుని వేడుకలను ఆనందంగా జరుపుకుంటారు.

ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేత కార్యక్రమం జరుగుతుంది. 1947లో ఈ రోజున భారతదేశం నుంచి బ్రిటిష్ రాజ్ జెండాను తొలగించి మన జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ సమయంలో జాతీయ జెండాను కింది నుంచి పైకి ఎగురవేయడాన్ని జెండా ఎగురవేయడం అని అంటారు. అప్పటి నుంచి ఆగస్టు 15న ఎర్రకోట ప్రాకారంపై ధ్వజారోహణం జరుగుతుంది.1947 ఆగస్టు 15న ఎర్రకోటపై మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత జనవరి 26న రాష్ట్రపతి జెండాను వేశారు.

 స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులు, నాయకులును వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని మోడీ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అంతేకాదు ఆసేతు హిమాచలం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. 

 --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com