ఫైనల్లీ పెళ్లి పీటలెక్కేసిన ఆ లవ్ బర్డ్స్.!
- September 17, 2024
సిద్దార్ధ్, అదితీ రావ్ హైదరీ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇంత వరకూ లవర్స్‌గా కొనసాగిన ఈ జంట తాజాగా హైద్రాబాద్‌లోని వనపర్తిలో వివాహ బంధంతో ఓ ఇంటి వారయ్యారు.
గత కొన్నాళ్లుగా ఈ ఇద్దరూ రిలేషన్షిప్లో వున్నారు. ఎక్కడ ఈ ఈవెంట్ జరిగినా జంటగా కనిపిస్తూ కెమెరాలకు మంచి స్టఫ్ ఇస్తూ వచ్చారు.
ఫైనల్లీ పెళ్లి చేసుకుని రూమర్స్‌కి చెక్ పెట్టేశారు. ‘మహా సముద్రం’ సినిమా నుంచీ వీరిద్దరి మధ్యా ఏదో జరుగుతోందంటూ ప్రచారం జరిగింది. కానీ, ఈ ఇద్దరూ ఎక్కడా ఏ విషయం కన్ఫామ్ చేయలేదింతవరకూ.
ఇక, తాజాగా పెళ్లి చేసుకుని సస్పెన్స్‌కి తెర దించేశారు. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. అలాగే, అదితీ రావ్ హైదరి సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి వచ్చిన పిక్స్‌లో అయితే, ‘నువ్వే నా సూర్యుడు, నువ్వే నా చంద్రుడు, నువ్వే నా తారాలోకం..’ అంటూ అదితి ఇచ్చిన క్యాప్షన్ అబ్బో.. నెటిజన్లను ఆశ్చర్యపరిచేలా వుంది.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







