‘ఓజీ’ అనుకుంటే.. ‘హరి హరవీరమల్లు’ ముందుకొచ్చేసిందే.!
- September 23, 2024
ఓ మై గాడ్.! పవన్ కళ్యాణ్ తక్కువోడు కాదు. కాదు కాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు.. ఇది ఆయనకు మాత్రమే సాధ్యమైన పని.
ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో వుండి ఆయన చక్కబెడుతున్న పనులు, చేపడుతున్న కార్యక్రమాలకు ఓ వైపు గిన్నీస్ వరల్డ్ రికార్డులే దక్కుతున్నాయ్.
అంత బిజీ షెడ్యూల్‌లోనూ తనను నమ్ముకున్న నిర్మాతల నమ్మకాల్నివమ్ము చేయకూడదన్న డెడికేషన్‌తో ఆయన ముఖానికి రంగు వేసుకునే ప్రయత్నం కూడా చేశారు.
చెప్పినట్లుగానే ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. రోజుకు 5 గంటల పాటు నిర్విరామంగా ఈ షూటింగ్ పూర్తి చేయనున్నారట.
విజయవాడ చుట్టుప్రకల ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. వారం రోజుల పాటు షూటింగ్ యథా తధంగా జరగనుందనీ తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయన దీక్షలో వున్న సంగతి తెలిసిందే. దీక్షలో వుంటూనే షూటింగ్‌లోనూ పాల్గొనబోతున్నారు. అలాగే రాజకీయ కార్యకలాపాలు కూడా.
ఇక, ఈ సినిమా అటకెక్కేసినట్లే అనుకుంటే, అనూహ్యంగా సెట్స్ మీదికొచ్చేసింది. మార్చిలో సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. ‘హరి హర వీరమల్లు’ షూటింగ్‌ని ఓ కొలిక్కి తెచ్చేశాకా, ‘ఓజీ’ మిగిలిన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసేయనున్నారట పవన్ కళ్యాణ్.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..