సందీప్ కిషనా.! ‘మజాకా’నా.!

- September 23, 2024 , by Maagulf
సందీప్ కిషనా.! ‘మజాకా’నా.!

సందీప్ కిషన్ ఈ సారి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లున్నాడు. తన కొత్త సినిమా కోసం పేరు మార్చేసుకున్నాడు. న్యూమరాలజీ ప్రకారం తన పేరులో కొన్ని లెటర్స్ తీసేశాడు.
ఈ సారైనా సందీప్ కిషన్‌కి అదృష్టం పట్టాలి. నక్కిన త్రినాధరావు దర్శీకత్వంలో సందీప్ కిషన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి ‘మజాకా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. లేటెస్ట్‌గా టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తి రేకెత్తించేలా వుంది.
పెళ్లి కొడుకు దుస్తుల్లో కనిపిస్తున్నాడు సందీప్ కిషన్ ఈ పోస్టర్‌లో. చేతిలో ఓ పాత టేపురికార్డర్ వుంది. బ్యాక్ గ్రౌండ్‌లో పెళ్లి సారెలా కనిపిస్తోంది. పోస్టర్ చాలా బ్రైట్‌గా డిజైన్ చేశారు.
అంతేకాదు, ఈ సినిమాతో తన పేరులో సవరణ చేసుకోవడమే కాదండోయ్, పేరుకు ముందు ‘పీపుల్స్ స్టార్’ అనే ట్యాగ్ కూడా చేర్చేసుకున్నాడు సందీప్ కిషన్.
ఇన్ని మార్పులు చేర్పులతో వస్తున్న ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాడు. తాజా పోస్టర్ చూస్తుంటే, సంక్రాంతికి అసలు సిసలు యాప్ట్ సినిమాలాగే అనిపిస్తోంది ‘మజాకా’. చూడాలి మరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com