పాపం ఎన్టీయార్.! రిలీజ్‌కి ముందే ఇలా జరిగిందేంటబ్బా.!

- September 23, 2024 , by Maagulf
పాపం ఎన్టీయార్.! రిలీజ్‌కి ముందే ఇలా జరిగిందేంటబ్బా.!

ఎంతో ప్రెస్టీజియస్ మూవీ. చాలా జాగ్రత్తగా తెరకెక్కించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు. అంతే జాగ్రత్తగా ఈవెంట్ కూడా ప్లాన్ చేయాలిగా.!
 కానీ, చేయలేదు. ఫ్యాన్స్ మధ్య  వాగ్వాదం. పాస్‌ల విషయంలో జరిగిన చిన్న రచ్చ.. పెద్ద చిచ్చుగా మారింది. ఫ్యాన్స్ కొట్టుకున్నారు. చాలా మందికి గాయాలు కూడా అయ్యాయ్.
దాంతో ఫైనల్‌గా ఈవెంటే రద్దు చేసేయాల్సిన పరిస్థితి వచ్చింది. రిలీజ్‌కి నాలుగు రోజులు ముందుందనగా.. ఇలా జరగడం నిజంగా దురదృష్టకరం.
అందుకే ఎన్టీయార్ చాలా బాధపడ్డారు. తన బాధనంతటినీ వ్యక్త పరుస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇలా జరగడం చాలా బాధాకరం.. ఫ్యాన్స్.. మీరే కాదు.. నేనూ చాలా బాధపడుతున్నాను.. అంటూ వ్యాఖ్యానించారు.
కానీ, ఇంత గొడవకు కారణమైన ఫ్యాన్స్‌ని ఒక్క మాట కూడా అనలేదు ఎన్టీయార్. ఫ్రస్టేషన్‌లో టంగ్ స్లిప్ అయితే.. అది ఎన్ని అనర్ధాలకు దారి తీస్తుందో అని భయపడ్డారో ఏమో చాలా కూల్‌గా డీల్ చేశారు.
ఈ ముందు జాగ్రత్త ఈవెంట్ మేనేజ్‌మెంట్‌కి కూడా వుంటే బాగుండేది. ఎన్టీయార్‌కి ఇలాంటి పరిస్టితి వచ్చేది కాదు. నిర్మాతలు నిర్లక్ష్యంతో  చేతులెత్తేయడంతోనే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని సినీ ప్రముఖులు గడ్డి పెడుతున్నారు. ఏం చేస్తారు.! నష్టమైతే జరిగిపోయింది. ఈ నష్టం సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com