‘దేవర’ సినిమాపై బెట్టింగులు.!
- September 25, 2024
‘ఆచార్య’ సినిమా తర్వాత కొరటాల శివ నుంచి వస్తున్న సినిమానే ‘దేవర’. మొదట్లో కాస్త నెగిటివిటీ వున్నప్పటికీ, రిలీజ్ డేట్ దగ్గరకొచ్చేసరికి విపరీతమైన హైప్ పెరిగింది.
ఇది నిజంగానే పెరిగిన హైపా.? లేక పెయిడా.? అనేది తెలియాలంటే రిలీజ్ డే వరకూ ఆగాల్సిందే. అయితే, ఈ సినిమాకి ఎక్స్ట్రా షోలకు పరిమితులు లభించాయ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ. అర్ధరాత్రి ఒంటి గంట నుంచే షోలు పడనున్నాయ్.
టాక్ బాగుంటే ఓకే. టాక్ ఏమాత్రం తేడా వచ్చినా అంతే సంగతి. అయితే, భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఎన్టీయార్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
నమ్మడమే కాదు, ఏకంగా భారీ స్థాయిలో బెట్టింగులు కూడా కట్టేస్తున్నారు. అయితే, గుర్తు పెట్టుకోవాల్సిందేంటంటే కొరటాల శివ ఓ డిజాస్టర్ తర్వాత రూపొందించిన సినిమా ఇది.
ఇలాంటి బెట్టింగులు ఎంతవరకూ సబబు.? వెరీ డేంజరస్ అంటూ కొందరు సినీ మేథావులు హెచ్చరిస్తున్నారు. కానీ, ఎన్టీయార్ ఫ్యాన్స్ దూకుడు మాత్రం ఆపడం లేదు.
అలాగే ఓవర్సీస్లోనూ ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయ్. అనూహ్యమైన స్థాయిలో టికెట్ బుకింగ్స్ జరిగాయని సమాచారం. అలాగే, చిరంజీవి, పవన్ కల్యాణ్ నుంచి ‘దేవర’కి ఫుల్ సపోర్ట్ రావడంతో, మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కూడా వున్నట్లే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..