సుధీర్ బాబు ఈ సారేం మ్యాజిక్ చేయబోతున్నాడో.!
- September 25, 2024
సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా సుధీర్ బాబు సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇటీవలే ‘హరోం హర’ అంటూ ఓ డిఫరెంట్ యాక్షన్ సినిమాతో ఓటీటీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు సుధీర్ బాబు.
లేటెస్ట్గా మరో కొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్నాడు. అదే ‘జటాధర’. రెండూ శివునికి సంబంధించిన టైటిల్సే కావడం విశేషం.
లేటెస్ట్గా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ ఆసక్తికరంగా అనిపిస్తోంది. బుల్లెట్‌పై వెళుతున్న సుధీర్ బాబు, ఆ వెనకే బ్యాక్ గ్రౌండ్లో ఏదో భయంకరమైన శక్తి వెంటాడుతూ వస్తోంది. ఎర్రటి మెరుపులతో కూడిన ఆకాశం భయంకరంగా కనిపిస్తోంది.
సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే, ఇదో సూపర్ నేచురల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇంతవరకూ ఈ తరహా కంటెంట్ మూవీస్‌లో సుధీర్ బాబు నటించింది లేదు.
చాలా సినిమాలు ఈ టైప్ కాన్సెప్ట్‌లో రూపొందాయ్. కొన్ని విజయవంతమయ్యాయ్ కూడా. మరి, సుధీర్ బాబు టచ్ చేశాడంటే ఆ కంటెంట్‌లోనూ ఖచ్చితంగా ఏదో ఇంట్రెస్టింగ్ విషయం దాగుంటుంది. చూడాలి మరి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..