ఖతార్ నేషనల్ లైబ్రరీ.. చిల్డ్రన్స్ ఆర్ట్ ఎగ్జిబిషన్ 'రీషా'..!!
- October 10, 2024
దోహా: హమద్ బిన్ ఖలీఫా యూనివర్శిటీ, చిల్డ్రన్స్ లిటరేచర్ సెంటర్‌తో కలిసి చిల్డ్రన్స్ ఆర్ట్ ఎగ్జిబిషన్ 2024 (రీషా)ను ఖతార్ నేషనల్ లైబ్రరీ నిర్వహిస్తోంది. “ఆర్ట్ వర్క్స్ ఇన్ ది సన్ ఇన్ ది నావెల్ మెన్ స్ఫూర్తి” అనే థీమ్‌తో అక్టోబరు 9న ప్రారంభమైన ఎగ్జిబిషన్ డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది. పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ఈ ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఖతార్ రచయిత అస్మా అల్ కువారి సహకారంతో సౌక్ వాకిఫ్ ఆర్ట్ సెంటర్, కటారా ఫైన్ ఆర్ట్స్ సొసైటీ సభ్యుడు ఖతార్ కళాకారుడు అహ్మద్ నౌహ్ మార్గదర్శకత్వంలో 11 పాఠశాలలకు చెందిన పిల్లలు రూపొందించిన 12 కళాకృతులను ప్రదర్శనలో ప్రదర్శించారు. పాలస్తీనియన్ రచయిత ఘాసన్ కనాఫాని రాసిన మెన్ ఇన్ ది సన్ నవల నుండి కథలను చిన్నారులు డ్రాయింగ్ ద్వారా జీవం పోశారని ఖతార్ నేషనల్ లైబ్రరీ ప్రాజెక్ట్ మేనేజర్ ఫతేమా అల్ మల్కీ తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి