ఇక పట్టాలెక్కడమే..హఫీత్ రైల్ కు OMR577 మిలియన్ ఫైనాన్సింగ్..!!

- October 10, 2024 , by Maagulf
ఇక పట్టాలెక్కడమే..హఫీత్ రైల్ కు OMR577 మిలియన్ ఫైనాన్సింగ్..!!

అబుదాబి: సోహార్ పోర్ట్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో అనుసంధానించే హఫీత్ రైల్ నెట్‌వర్క్ ప్రాజెక్ట్ బ్యాంక్ ఫైనాన్సింగ్‌పై హఫీత్ రైల్ సంతకం చేసింది. మొత్తం OMR577 మిలియన్ల ప్రాజెక్ట్ కు ఒమానీ,  ఎమిరాటీ బ్యాంకులతోపాటు పలు అంతర్జాతీయ బ్యాంకులు ఫైనాన్స్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.  ప్రెసిడెన్షియల్ కోర్ట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ ఫాలెన్ హీరోస్ అఫైర్స్ డిప్యూటీ చైర్మన్, ఎతిహాద్ రైల్ చైర్మన్ షేక్ థెయాబ్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గ్లోబల్ రైల్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిబిషన్ & కాన్ఫరెన్స్ - గ్లోబల్ రైల్ 2024 ప్రారంభోత్సవం సందర్భంగా ఒప్పందాలు జరిగాయి. OMR961 మిలియన్ జాయింట్ ప్రాజెక్ట్ ను హఫీత్ రైల్ నిర్వహిస్తుంది. 238 కి.మీ పొడవైన రైల్వే నెట్‌వర్క్ లో 60 వరకు వంతెనలు, సొరంగాలు ఉన్నాయి. రెండు దేశాలలో ఐదు ప్రధాన ఓడరేవులు, వివిధ పారిశ్రామిక, ఫ్రీ జోన్‌లను రైల్వే కలుపుతుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com