రిటైర్మెంట్‌ ప్రకటించిన రఫెల్‌ నాదల్‌

- October 10, 2024 , by Maagulf
రిటైర్మెంట్‌ ప్రకటించిన రఫెల్‌ నాదల్‌

స్పెయిన్: ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు దిగ్గజ ఆటగాడు రఫెల్‌ నాదల్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. నవంబర్‌లో జరగనున్న డేవిస్‌ కప్‌ ఫైనల్‌ తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతానని ప్రకటించాడు. ”నేను ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ నుంచి రిటైర్‌ అవుతున్నాను. గత రెండేళ్లు కఠినంగా గడిచాయి. ఈ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పట్టింది. కానీ, జీవితంలో ప్రతిదానికీ ప్రారంభం, ముగింపు అనేది ఉంటుంది” అని నాదల్‌ పేర్కొన్నాడు.కెరీర్‌లో నాదల్‌ గెలిచిన గ్రాండ్‌స్లామ్‌లు.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ (2): 2009, 2022ఫ్రెంచ్‌ ఓపెన్‌ (14): 2005, 2006, 2007, 20008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020, 2022 వింబుల్డెన్‌ (2) : 2008, 2010యూఎస్‌ ఓపెన్‌ (4): 2010, 2013, 2017, 2019

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com