ఆ ఒక్క కారణంతోనే రతన్ టాటా విదేశాల నుంచి భారత్ కు వచ్చారా..?

- October 11, 2024 , by Maagulf
ఆ ఒక్క కారణంతోనే రతన్ టాటా విదేశాల నుంచి భారత్ కు వచ్చారా..?

రతన్ టాటా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మృతితో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్వీట్‌ చేస్తూ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు ఉన్నాయి. రతన్ టాటా విదేశాల్లో స్థిరపడాలని అనుకున్నప్పటికీ, చివరికి భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణం చాలా హృదయవిదారకమైనది.

రతన్ టాటా గారు పై చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే కార్నెల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నారు. ఆర్కిటెక్చర్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు.ఆ క్రమంలో 1955 నుంచి 1962 వరకు అమెరికాలోనే ఉన్నారు. అమెరికాలో తన విద్యను పూర్తి చేసి లాస్ ఏంజెల్స్‌లో ఉద్యోగం పొందారు. అక్కడే ఆయన ఒక యువతిని గాఢంగా ప్రేమించారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ టాటా గారికి వాళ్ళ అమ్మమ్మ నవాజ్‌బాయి అంటే ఎంతో ఇష్టం.
అమ్మమ్మ ఆరోగ్యం బాగోలేదని తెలిసి, ఆయన హుటాహుటిన భారత్‌కు వచ్చారు.

ఇక్కడే ఆయనకు చాలా రోజులు ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలోనే ఇండో-చైనా యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం కారణంగా రతన్ టాటా తిరిగి అమెరికాకు వెళ్లలేకపోయారు. ఆ సమయంలో రతన్ టాటాకు IBM నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. కానీ టాటా సంతోషించలేదు. తిరిగి అమెరికా వెళ్ళలేక పోయారు. ఆమె ప్రేమకు గుర్తుగా టాటా గారు పెళ్లి చేసుకోకుండా అలాగే జీవితంలో ఉండిపోయారు. ఈ పరిస్థితుల్లో ఆయన ప్రేమ కథ కూడా ముగిసిపోయింది. ఆయన జీవితంలో ఈ సంఘటన ఒక ముఖ్యమైన మలుపు అని చెప్పవచ్చు.

రతన్ టాటా తన జీవితంలో ఎన్నో విజయాలు సాధించారు. కానీ, ఈ సంఘటన ఆయన మనసులో ఎప్పటికీ నిలిచిపోయింది.
ఇది రతన్ టాటా జీవితంలోని ఒక ముఖ్యమైన అధ్యాయం. ఆయన చేసిన త్యాగం, దేశం కోసం చూపిన ప్రేమ మనందరికీ స్ఫూర్తిదాయకం.

ప్రస్తుతం ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా(Ratan Tata) ఇక మన మధ్య లేరు. 86 ఏళ్ల వయసులో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కానీ ఆయన మాత్రం మన హృదయాల్లో ఎప్పుటికీ నిలిచి ఉంటారు. 

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com