దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2024.. ఈవెంట్ పూర్తి వివరాలు..!!
- October 11, 2024
దుబాయ్: ఈ సంవత్సరం దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్.. ప్రతిష్టాత్మక ఈవెంట్ ఎనిమిదవ ఎడిషన్ అక్టోబరు 24న ప్రారంభం కానుందని నిర్వాహకులు తెలిపారు. దుబాయ్ ఫెస్టివల్స్ మరియు రిటైల్ ఎస్టాబ్లిష్మెంట్ CEO అహ్మద్ అల్ ఖాజా మాట్లాడుతూ.. దుబాయ్‌లో మేము సంవత్సరాలుగా నెలకొల్పిన రికార్డు సంఖ్యలను అధిగమించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమం 30 రోజుల పాటు ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయమని నివాసితులందరినీ ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈవెంట్ కోసం రిజిస్ట్రేషన్లు ఇప్పటికే ప్రారంభం అయినట్లు పేర్కొన్నారు. నవంబర్ 10న సైక్లిస్టులు షేక్ జాయెద్ రోడ్, డౌన్‌టౌన్ దుబాయ్ చుట్టూ 12కిమీ మార్గం లేదా 4కిమీ దూరాన్ని ఎంచుకోవచ్చని తెలిపారు.
ఈ సంవత్సరం మూడు ఫిట్నెస్ గ్రామాలు, 23 పైగా ఫిట్నెస్ హబ్‌లు నగరం అంతటా ఏర్పాటు చేశారు. ఐకానిక్ కైట్ బీచ్ ఫిట్నెస్ గ్రామం అన్ని వయసుల సందర్శకుల కోసం వివిధ కార్యకలాపాలతో ఉండగా.. దుబాయ్ మునిసిపాలిటీ ఫిట్నెస్ గ్రామం జబీల్ పార్క్ లోపల ఉంటుంది. ఇది కొత్త క్రికెట్ జోన్, రన్నింగ్ క్లబ్, స్పిన్నింగ్ జోన్, కిడ్స్ ఫిట్నెస్ జోన్‌తో సహా అనేక రకాల ఫిట్నెస్ జోన్లను హోస్ట్ చేస్తుంది. ఈ గ్రామం దుబాయ్ రన్, దుబాయ్ రైడ్ కోసం అధికారిక బిబ్ పంపిణీ కేంద్రంగా కూడా పనిచేస్తుందన్నారు. RTA అల్ వర్కా పార్క్ ఫిట్నెస్ గ్రామం సైక్లింగ్ నుండి మల్టీ-స్పోర్ట్ జోన్ల వరకు అనేక రకాల కార్యకలాపాలకు కేంద్రంగా ఉండనుంది.
ప్లస్500 సిటీ హాఫ్ మారథాన్ అక్టోబర్ 27న జరుగుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్లోని గేట్ బిల్డింగ్ వద్ద ప్రారంభమవుతుంది. తొలిసారిగా ప్రీమియర్ పాడెల్ P1 టోర్నమెంట్ నవంబర్ 3న దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ స్టేడియంలో జరగనుంది. విజేతలకు Dh8 మిలియన్ల ప్రైజ్ మనీని పంపిణీ చేయనున్నారు. సూపర్ పాపులర్ దుబాయ్ రన్ నవంబర్ 24న నిర్వహించనున్నారు. వేలాది మంది పాల్గొనేవారు షేక్ జాయెద్ రోడ్లో 5 కిమీ, 10 కిమీల మార్గాలలో దుబాయ్ ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌ల వెంట రన్ కొనసాగనుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి