తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు భూమిపూజ.

- October 11, 2024 , by Maagulf
తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు భూమిపూజ.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 28 ఇంటిగ్రేటెడ్ గురుకులాల భవన నిర్మాణాలకు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని కొందుర్గులో భూమిపూజ చేసి ప్రారంభించారు.ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లక్ష్మీపురంలో డిప్యూటీ CM భట్టి విక్రమార్క ప్రారంభించారు.ఇంకా సిద్దిపేట జిల్లా తంగళ్లపల్లిలో మంత్రి పొన్నం ప్రభాకర్, నల్గొండ లోని గంధవారిగూడలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమనపల్లిలో మంత్రి శ్రీధర్ బాబు భూమి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర మంత్రులు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. 


ఈ కార్యక్రమం ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా సకల సౌకర్యాలతో ఈ భవనాలను 20-25 ఎకరాల్లో నిర్మిస్తారు. ఒక్కో స్కూలు సముదాయానికి రూ. 100-రూ. 125 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం భూమి లభ్యత ఉన్న 28 నియోజకవర్గాల్లో శంకుస్థాపన జరిగింది.

 మొదటి విడత కింద ఎంపిక చేసిన నియోజకవర్గాలు: కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్లగొండ, హుజూర్‌నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, అందోల్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట్, స్టేషన్‌ ఘన్‌పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్‌నగర్, పరకాల, నారాయణ్‌ ఖేడ్, దేవరకద్ర, నాగర్‌ కర్నూల్, మానకొండూర్, నర్సంపేట. ఈ కార్యక్రమం ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com