డీఎస్పీగా మహ్మద్ సిరాజ్ బాధ్యతలు...
- October 11, 2024
హైదరాబాద్: డీఎస్పీగా టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం తెలంగాణ డీజీపీకి రిపోర్టు చేసిన తర్వాత.. సిరాజ్ అధికారికంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించారు.సిరాజ్‌కు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, మహ్మద్ సిరాజ్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.
టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో హైదరాబాద్కు చెందిన స్టార్ బౌలర్ సిరాజ్ కూడా సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన సిరాజ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.ఈ సందర్భంగా.. సిరాజ్‌కు క్రికెటర్ మహ్మద్ సిరాజ్కు తెలంగాణ ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లో 600చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది.
అంతర్జాతీయ క్రికెట్లో భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చిన సిరాజ్ను ముఖ్యమంత్రి అభినందించారు.ఈ క్రమంలో సిరాజ్కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు..ఈ రెండు హామీలను ప్రభుత్వం నెరవేర్చింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి