ఒమన్ లో 7.8% పెరిగిన 3-5 స్టార్ హోటల్ ఆదాయం..!!
- October 13, 2024
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో 3-5 స్టార్ హోటళ్ల ఆదాయం ఆగస్టు 2023 చివరి నాటికి OMR138.650 మిలియన్లతో పోలిస్తే 2024 ఆగస్టు చివరి నాటికి 7.8 శాతం పెరిగి OMR149.446 మిలియన్లకు చేరుకుంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) జారీ చేసిన నివేదిక తెలిపింది. అదే విధంగా హోటల్ విజిటర్స్ సంఖ్యలో 8.4 శాతం పెరుగుదల నమోదైంది. గత ఆగస్టు చివరి నాటికి దాదాపు 1,400,735 మంది అతిథులు రాగా, ఆగస్టు 2023 చివరి నాటికి 1,292,509 మంది అతిథులు వచ్చారు. ఆక్యుపెన్సీ రేటు 2.3 శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపింది.
ఒమానీ అతిథుల సంఖ్య 7.5 శాతం పెరిగి 541,035 మంది అతిథులకు చేరుకోగా, గల్ఫ్ అతిథుల సంఖ్య 0.6 శాతం పెరిగి 140,394 మంది అతిథులకు చేరుకుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇతర అరబ్ అతిథుల సంఖ్య 13.8 శాతం పెరుగుదలతో 69,087కి చేరుకుంది. అయితే యూరోపియన్ అతిథుల సంఖ్య 16.5 శాతం పెరిగి 322,632కి చేరుకుంది. అమెరికా నుండి వచ్చిన అతిథుల సంఖ్య 38,190 మంది అతిథులు(3.2 శాతం పెరుగుదల)రాగా, ఆఫ్రికా ఖండం నుండి వచ్చిన అతిథుల సంఖ్య 3 శాతం పెరుగుదలతో 7,569 మంది అతిథులకు చేరుకుంది. ఇక ఆసియా అతిథుల సంఖ్య 8.3 శాతం పెరిగి 203,932 అతిథులకు చేరుకుందని, అయితే ఓషియానియా నుండి వచ్చిన అతిథుల సంఖ్య 27.2 శాతం తగ్గి 19,758కి చేరుకుందని నివేదిక స్పష్టంచేసింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి