సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ పై హత్యాయత్నం

- December 04, 2024 , by Maagulf
సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ పై హత్యాయత్నం

పంజాబ్: శిరోమణి అకాలీదళ్ చీఫ్, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై బుధవారం హత్యాయత్నం చోటుచేసుకుంది.ఈ ఘటన అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయం వెలుపల జరిగింది. సేవాదర్ విధుల్లో ఉన్న సమయంలో ఓ వ్యక్తి కాల్పులు జరిపినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ బుల్లెట్ గోడను తాకడంతో బాదల్ ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. బాదల్ అప్పట్లో వీల్‌చైర్‌లో ఉన్నారు, దీనివల్ల మరింత ప్రమాదం తప్పింది. నారాయణ్ సింగ్‌గా గుర్తించిన నిందితుడు స్వర్ణ దేవాలయం వెలుపల ఉన్న కొందరు వ్యక్తులపై కూడా దాడికి పాల్పడ్డాడు. దాడి జరిగిన వెంటనే అక్కడున్నవారు అతనిని నిరోధించారు.

పోలీసులు సంఘటన స్థలానికి వెంటనే చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకోవడంతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో నిందితుడి మానసిక పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు కారణాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మీద హత్యాయత్నం వార్త రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. రాజకీయ నాయకులు, ప్రజలు ఈ సంఘటనను ఖండిస్తున్నారు. స్వర్ణ దేవాలయం వంటి పవిత్ర స్థలంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. పంజాబ్ ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. రాజకీయ నాయకుల భద్రతపై ప్రశ్నలు ఉత్థవగా, భద్రతా ఏర్పాట్లను పునఃసమీక్షించాల్సిన అవసరాన్ని నిపుణులు సూచిస్తున్నారు.ఈ సంఘటన రాజకీయంగా రాష్ట్రంలో పలు చర్చలకు కారణమైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com