మస్కట్లో అక్రమ క్యాంపింగ్లకు భారీ జరిమానాలు..!!
- December 04, 2024
మస్కట్: ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణను కాపాడే లక్ష్యంతో క్యాంపింగ్ కోసం మస్కట్ గవర్నరేట్ కొత్త నిబంధనలను జారీ చేసింది. మస్కట్ గవర్నరేట్లో లైసెన్సు లేకుండా క్యాంపులు చేసే ఎవరికైనా OMR 200 జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది. 48 గంటల కంటే ఎక్కువ సమయం క్యాంపులు, కారవాన్లు, టెంట్లు లేదా సెషన్లలో అనుమతి లేకుండా అనుమతించబడదని మస్కట్ గవర్నరేట్ ఒక ప్రకటనలో తెలిపింది. OMR 100 బీమా తప్పనిసరిగా చెల్లించాలని నిర్దేశించింది. లైసెన్స్ ఏడు రోజులకు వర్తిస్తుందని, రెన్యువల్ చేసుకోవచ్చని తెలిపింది.
క్యాంపింగ్ సైట్ గైడ్ లైన్స్:
1. ఇది మునిసిపాలిటీ ద్వారా నిర్దేశిత ప్రదేశాలలోనే ఉండాలి.
2. క్యాంపింగ్ సైట్, బీచ్ మధ్య కనీసం 10 మీటర్ల దూరం ఉండాలి.
3. ప్రతి సైట్ మధ్య కనీసం 5 మీటర్ల దూరం తప్పనిసరి.
4. క్యాంపింగ్ సైట్ మత్స్యకారుల సైట్లు, భద్రతా నిషేధిత సైట్లకు దూరంగా ఉండాలి.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







