తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌ని ఆహ్వానించిన మంత్రి పొన్నం
- December 07, 2024
హైదరాబాద్: మాజీమంత్రి కేసీఆర్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం అయ్యారు.ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కేసీఆర్ ను ఆహ్వానించారు మంత్రి పొన్నం. సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు.కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు వేణుగోపాల్, ఇతర ప్రోటోకాల్ అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట ఉన్నారు. డిసెంబర్ 9న సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు కేసీఆర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్.. కేసీఆర్ ను ఆహ్వానించారు.
తాజా వార్తలు
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్







