'దుబాయ్ వాక్' ప్రాజెక్ట్‌ను ప్రకటించిన షేక్ మహమ్మద్..!!
- December 08, 2024
దుబాయ్: సైకిల్-స్నేహపూర్వక నగరంగా దుబాయ్ మారనుంది. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ వాకింగ్ విస్తృతమైన నెట్‌వర్క్ ప్రణాళికను ప్రకటించారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, 'దుబాయ్ వాక్' అనే ప్రాజెక్ట్‌లో 3,300 కి.మీ నడక మార్గాల అభివృద్ధి ప్రాజెక్టును X లో ప్రకటించారు. మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్, అల్ రాస్ అనే రెండు ప్రాంతాలలో ప్రారంభం కానున్న ఈ బృహత్తర ప్రాజెక్ట్, నగరాన్ని ఏడాది పొడవునా పాదచారులకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తుందన్నారు.ఈ ప్రాజెక్టులో 110 పాదచారుల వంతెనలు ,సొరంగాలు, 112 కిమీ వాటర్ ఫ్రంట్ మార్గాలు, 124 కిమీ గ్రీన్ వాకింగ్ ట్రైల్స్, 150 కిమీ గ్రామీణ మరియు పర్వత పాదచారుల మార్గాలు ఉంటాయని తెలిపారు. ఎమిరేట్ ద్వారా 6,500 కి.మీ కంటే ఎక్కువ ఇంటర్‌కనెక్టడ్ పాత్‌వేలను ఏర్పాటు చేయాలని ప్లాన్ లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి