700 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. 700 మంది నర్సులు, 1425 కేరళీయుల పై విచారణ..!!
- December 08, 2024
కువైట్: కువైట్‌లోని బ్యాంకును సుమారు ₹700 కోట్ల మోసం చేసి ఇతర విదేశాలకు పారిపోయిన 700 మంది నర్సులతో సహా 1,425 మంది కేరళీయులపై కేరళ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేరళలోని కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాల్లో వీటికి సంబంధించి 10 కేసులు నమోదయ్యాయి. కువైట్‌లోని ఓ బ్యాంకు సీనియర్ అధికారులు కేరళను సందర్శించి శాంతిభద్రతల ఇన్‌ఛార్జ్ ఏడీజీపీకి ఫిర్యాదు చేయడంతో బ్యాంక్ ఫ్రాడ్ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఎక్కువ మంది నర్సులు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నారని సమాచారం. వారు కువైట్‌లో పని చేస్తున్నప్పుడు బ్యాంకు నుండి 35,000 KD నుండి 45,000 KD (సుమారు రూ.90 లక్షలు నుండి రూ.1.25 కోట్ల రూపాయలు) మధ్య రుణం తీసుకున్నారు. తరువాత రుణాన్ని తిరిగి చెల్లించకుండా అమెరికా, యూకే, కెనడా వంటి ఇతర దేశాలకు వెళ్లారు. బ్యాంక్ వారి కేరళ చిరునామాతో సహా డిఫాల్టర్ల వివరాలను పోలీసులకు అందజేసింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి