బహ్రెయిన్ లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. ద్వైపాక్షిక సంబంధాలపై ఫోకస్..!!
- December 08, 2024
మనామా: భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రెండు రోజుల పర్యటన నిమిత్తం బహ్రెయిన్ వచ్చారు. బహ్రెయిన్ విదేశాంగ మంత్రి హెచ్ఇ డా. అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీతో కలిసి 4వ ఇండియా-బహ్రెయిన్ హై జాయింట్ కమిషన్ (హెచ్జెసి)లో పాల్గొననున్నారు. అదే విధంగా 20వ ఐఐఎస్ఎస్ మనామా డైలాగ్ ముగింపు ప్లీనరీ సెషన్లో కూడా జైశంకర్ పాల్గొని మాట్లాడనున్నారు.
ఈ పర్యటన భారతదేశం - బహ్రెయిన్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని అధికార యంత్రాంగం తెలిపింది. మంత్రివర్గ సమావేశం ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం, ద్వైపాక్షిక సంబంధాల స్వరూపంపై సమీక్షిస్తుందన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు , మౌలిక సదుపాయాల అభివృద్ధిలో తమ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి రెండు దేశాలు మార్గాలను అన్వేషించాలని భావిస్తున్నాయి. అలాగే ప్రస్తుతం ప్రపంచ వ్యాఫ్తంగా నెలకొన్న యుద్ధ వివాదాలను పరిష్కరించడం, శాంతి మరియు స్థిరత్వాన్ని నిర్ధారించడంపై ఇరుపక్షాలు అభిప్రాయాలను మార్పిడి చేసుకోవాలని భావిస్తున్నాయి. భారత విదేశాఖ మంత్రి సందర్శన ఇండియా- బహ్రెయిన్ మధ్య దీర్ఘకాలిక సంబంధాన్ని బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుందని, వివిధ రంగాలలో లోతైన సహకారానికి మార్గం సుగమం చేస్తుందని, ప్రాంతీయ స్థిరత్వం శ్రేయస్సుకు దోహదం చేస్తుందని బహ్రెయిన్ విదేశాంగ కార్యాలయం వెల్లడించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి