సౌదీ అరేబియాలో బయటపడ్డ 56 మిలియన్ ఏళ్ల శిలాజాలు..!!

- December 09, 2024 , by Maagulf
సౌదీ అరేబియాలో బయటపడ్డ 56 మిలియన్ ఏళ్ల శిలాజాలు..!!

రియాద్: సౌదీ అరేబియా ఉత్తర సరిహద్దు ప్రాంతంలో రస్ అల్-రూస్ అవక్షేపణ నిర్మాణంలో సున్నపురాయి రాళ్ల పొరలలో ఈయోసిన్ యుగం నాటి సముద్ర జీవుల అవశేషాలు కనుగొన్నట్టు సౌదీ జియోలాజికల్ సర్వే (SGS) ప్రతినిధి తారిక్ అబా అల్-ఖైల్ తెలిపారు. ఈ అస్థి చేపలను కలిగి ఉన్న ఈ సకశేరుక శిలాజాలు..సౌదీ అరేబియాలో గుర్తించడం మొదటిసారని వెల్లడించారు. ఈ శిలాజాలు టెథియాన్ సముద్రంలో ప్రారంభ ఈయోసిన్ సముద్ర సమాజాల పర్యావరణాన్ని అర్థం చేసుకోవడంలో చాలా ప్రాముఖ్యత కలిగిన అంతరించిపోయిన క్యాట్ ఫిష్ (సిలురియన్లు)కు చెందినవిగా ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com