వారానికి 1,000 దిర్హామ్‌లు.. వింటర్ క్యాంప్ ఖర్చులపై ఆందోళన..!!

- December 09, 2024 , by Maagulf
వారానికి 1,000 దిర్హామ్‌లు.. వింటర్ క్యాంప్ ఖర్చులపై ఆందోళన..!!

యూఏఈ: యూఏఈలోని తల్లిదండ్రులు తమ పిల్లల కోసం వింటర్ క్యాంప్ ఖర్చుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ కొన్ని గంటలు మాత్రమే ఉంటుందని, వారానికి Dh1,100 వరకు ఖర్చవుతుందని తెలిపారు. 

దేశంలోని పాఠశాలలు డిసెంబరు 16నుండి జనవరి 5వరకు మూడు వారాల శీతాకాల విరామం ప్రకటించారు. ఈ సమయంలో వింటర్ క్యాంపు కోసం పేరెంట్స్ ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఈ క్యాంపులకు అధిక ఖర్చులు అవుతుండటంతో.. కొంతమంది తల్లిదండ్రులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు.

“నేను 4వ సంవత్సరంలో ఉన్న నా చిన్న కొడుకును ISM ఫుట్‌బాల్ క్యాంప్‌కు పంపాలని ఆలోచిస్తున్నాను. కానీ దాని ధర వారానికి Dh780. కానీ చాలా క్యాంప్ ఎంపికలు వారానికి దాదాపు Dh1,000- Dh1,100 ధర ఉంది." అని నేహా భగవతి అనే భారతీయ గృహిణి తెలిపారు. "ఈ శిబిరాలు చాలా ఖరీదైనవి, కానీ దురదృష్టవశాత్తూ, అవి మా ఏకైక ఎంపిక. పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల పని చేయడం నాకు కష్టమవుతుంది. కాబట్టి నేను పిల్లలను క్యాంపుకు పంపాలనుకుంటున్నాను. సాలీ సస్టైనబుల్ సిటీలోని తన ప్రాంతంలో క్రీడలు, కళలు, ఆటల క్యాంపులు ఉన్నాయి. ఒక్కో బిడ్డ కోసం రోజుకు Dh165 నుండి వారానికి Dh715 వరకు ధరలు ఉన్నాయి. "  అని ఇద్దరు పిల్లల తల్లి సాలీ మాడిసన్ చెప్పారు.  క్యాంపులకు అధిక ఖర్చులపై ఆందోళనలు ఉన్నప్పటికీ, కొంతమంది తల్లిదండ్రులు దుబాయ్‌లోని వివిధ రకాల క్యాంపులకు తమ పిల్లలను పంపేందుకు ఆసక్తి చూపుతున్నారు.       

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com